పెద్ద నోట్లు రూ.500, రూ.1000ను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయానికి నేటికి పదిరోజులు. ఇన్ని రోజులకి శనివారం బ్యాంకుల వద్ద క్యూలైన్లు కొంచెం తగ్గుముఖం పట్టాయి. కానీ ఏటీఎంల వద్ద పరిస్థితి మాత్రం అలాగే ఉంది. క్యూలైన్లతో ఏటీఎంలు కిటలాడుతున్నాయి. అమలులో లేని నోట్ల మార్పిడిలో కఠినతరమైన నిబంధనలు, కేవలం వారి సొంత కస్టమర్లకే నేడు బ్యాంకులు పనిచేయనుడటంతో బ్యాంకులు వద్ద క్యూలైన్లు తగ్గినట్టు తెలుస్తోంది.