breaking news
Queues
-
ఈ-పాస్‌పోర్టు ఉంటే..క్యూలేకుండానే సెక్యూరిటీ చెక్
విదేశీ ప్రయాణాలు చేసేవారికి గమ్యస్థానానికి చేరుకున్నాక ఇమిగ్రేషన్ చెక్, ఇతరత్రా తనిఖీలు తెలియనిది కాదు..! కొన్ని సందర్భాల్లో ఈ తనిఖీల కోసమే చాంతాడంత క్యూలైన్లో గంటల తరబడి నిలబడాల్సి ఉంటుంది..! కానీ, ఇటీవల భారత్ అమల్లోకి తెచ్చిన ఈ-పాస్‌పోర్టు ఉన్నవారు మాత్రం ఇలాంటి క్యూలైన్లలో నిలబడకుండానే.. చాలా సులభంగా విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లే వెసులుబాటు ఉంటుంది. ఈ-పాస్‌పోర్టు విదేశీ ప్రయాణికుల ప్రయాణాన్ని సులభతరం చేస్తోంది. కొత్త పాస్‌పోర్టు దరఖాస్తుదారులతోపాటు.. రెన్యూవల్ చేయించుకునేవారు కూడా ఇప్పుడు ఈ-పాస్‌పోర్టుకు జైకొడుతున్నారు. సాధారణ పాస్పోర్టుతో పోలిస్తే.. ఈ-పాస్‌పోర్టులో ఓ మైక్రోచిప్ ఉంటుంది. అందులో పాస్‌పోర్టుదారుడి వేలిముద్రలు, ఫొటోలు, ప్రయాణ వివరాలు.. ఇలా అన్నీ డిజిటల్‌గా రికార్డ్ అయ్యి ఉంటాయి. అలాగని ఈ చిప్‌కు హ్యాకింగ్ బెడద ఉండదు. ఎందకంటే.. ఇది పూర్తిస్థాయిలో ఎన్‌క్రిప్ట్ అయ్యి ఉంటుంది. చూడ్డానికి సాధారణ పాస్‌పోర్టు మాదిరిగానే ఉన్నా.. పాస్‌పోర్టు కవర్‌పై చిన్న బంగారు చిహ్నంతో మైక్రోచిప్ ఉండడం ఈ-పాస్‌పోర్టు ప్రత్యేకం. మన దేశంలో 2024 ఏప్రిల్ నుంచి ఈ-పాస్‌పోర్టు జారీ ప్రారంభమైంది. ఇప్పటికే అమెరికా, కెనడా, జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియాతోపాటు.. 120 దేశాల్లో ఈ-పాస్‌పోర్టు విధానం అమల్లో ఉంది.అసలు ఈ-పాస్‌పోర్టు ప్రత్యేకత ఏంటంటే.. పాస్పోర్టుదారుడు బయోమెట్రిక్ అందజేస్తే తప్ప.. ఇందులోని వివరాలు ఇమిగ్రేషన్ అధికారులు యాక్సెస్ చేయలేరు. ఇందులో బీఏసీ.. అంటే బేసిక్ యాక్సెస్ కంట్రోల్, పాసివ్ అథెంటికేషన్, ఎక్స్టెండెడ్ యాక్సెస్ కంట్రోల్ వంటి అనేక భద్రతా ఫీచర్లు ఉంటాయి. ఫలితంగా.. విమానాశ్రయాల్లో తనిఖీ సులభతరమవుతుంది. ఇమిగ్రేషన్, కస్టమ్స్, ఇతర తనిఖీ అధికారులు ఈ-పాస్‌పోర్టులోని సమాచారాన్ని అనుమానించే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే.. వ్యతిగత సమాచార తస్కరణ, వివరాల ట్యాంపరింగ్ ఇందులో అసాధ్యం కాబట్టి..! ఈ-పాస్‌పోర్టును ట్యాంపర్ చేయడం.. వివరాలను మార్చడం వంటి మోసాలు అంత సులభం కాదు. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఆమోదించిన ప్రమాణాల ప్రకారం ఈ-పాస్‌పోర్ట్‌లను భారత్ జారీ చేస్తోంది. అందుకే.. 120 దేశాలకు ఈ-పాస్‌పోర్టులను యాక్సెస్ చేసే వ్యవస్థ ఉంది. అంటే.. ఈ-పాస్‌పోర్టు ఉన్నవారు 120 దేశాల్లో ఎక్కడా కూడా తనిఖీల కోసం క్యూ కట్టాల్సిన అవసరం ఉండదు.విదేశీ ప్రయాణాల్లో ఇమిగ్రేషన్ ప్రక్రియ చాలా మందికి శిరోభారాన్ని తెచ్చిపెడుతుంది. భారత్‌నుంచి బయలుదేరేప్పుడే ఐఎంఆర్సీ అవసరమా? కాదా? వెళ్లబోతున్న దేశంలో మాట్లాడే భాషపై అవగాహన ఉందా? ఇంగ్లిష్ ఎలా ఉంది? అనే వివరాలను తనిఖీ చేయడం తెలిసిందే..! ఈ-పాస్‌పోర్టు విషయంలో ఇలాంటి ఇబ్బందులు ఉండవు. ఇక ఈ-పాస్‌పోర్టు విధానం అమల్లో ఉండే గమ్యస్థాన దేశాన్ని చేరాక కూడా.. సాధారణ పాస్‌పోర్టుదారులకు భిన్నంగా సపరేట్ క్యూలైన్ ఉంటుంది. ఈ క్యూలో తనిఖీలు వేగంగా జరుగుతాయి. సాధారణ పాస్పోర్టుదారుల క్యూలో మాత్రం ఒకరి తనిఖీ పూర్తయ్యాకే.. మరొకరిని తనిఖీ చేస్తారు. అంటే.. ఈ-పాస్‌పోర్టు ఇప్పడు ఇమిగ్రేషన్ విధానాన్ని చాలా సులభతరం చేసిందన్నమాట..! -
'క్యూ' మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు!
లక్నో: నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకు క్యూలలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు క్యూలలో మృతి చెందినట్లు పేర్కొన్న 13 మంది కుటుంబాలకు ఆయన శనివారం చెక్కులు ప్రధానం చేశారు. బ్యాంకు క్యూలో నిలుచున్న సమయంలో.. పురిటి నొప్పులతో బిడ్డకు జన్మనిచ్చిన ఓ మహిళకు సైతం సీఎం రూ. 2లక్షల చెక్కును ప్రధానం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడిన సమయంలో నల్లధనం ఇండియాకు సహాయపడిందంటూ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అఖిలేష్.. డీమానిటైజేషన్ చర్య సరైనది కాదని, దేశానికి హానికరం అని పేర్కొంటున్న విషయం తెలిసిందే. నోట్ల రద్దుపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని త్వరలో జరగబోయే ఎన్నికల్లో డీమానిటైజేషన్‌కు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేస్తారని అఖిలేష్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
ఏటీఎంలలో డబ్బుంది.. జనమే లేరు!
శ్రీనగర్: పెద్ద నోట్ల రద్దు అనంతరం బ్యాంకులు, ఏటీఎంల వద్ద నెలకొన్న గందరగోళ పరిస్థితులు తెలిసినవే. ఏటీఎంల వద్ద డబ్బు కోసం జనం భారీ క్యూల్లో జనం పడుతున్న బాధలు అంతాఇంతా కావు. పక్కనే మనిషి చచ్చిపోయినా పట్టించుకోకుండా క్యూల్లో జనం ముందుకు సాగుతున్న పరిస్థితులనూ చూశాం. దేశంలో దాదాపు అన్ని చోట్ల ఇదే పరిస్థితి నెలకొన్నప్పటికీ.. జమ్మూకశ్మీర్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది. దేశంలో ఎక్కడ చూసినా నో క్యాష్ బోర్డులతో వెక్కిరిస్తోంటే.. కశ్మీర్లో మాత్రం ఏటీఎంలలో డబ్బులున్నా అటువైపు చూసే వారే లేరు. ఎక్కడో ఒక చోట గరిష్టంగా ఐదారుగురు మాత్రమే ఏటీఎం క్యూల్లో కనిపిస్తున్నారు. నోట్ల రద్దు తరువాత ఇక్కడ మొదటి రెండు రోజులు మాత్రం ఏటీఎంల వద్ద జనం కాస్త బారులు తీరినట్లు కనిపించారు. ఆ తరువాత ఏటీఎంలు, బ్యాంకుల వద్ద సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి అని సోపోర్‌లోని జమ్మూ అండ్ కశ్మీర్ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ ఇజాజ్ అహ్మద్ వెల్లడించారు. కశ్మీర్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మూలంగా ప్రజల ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడమే దీనికి కారణమని ఆయన తెలిపారు. జులైలో హిజ్బుల్ ఉగ్రవాది బుర్హాన్ వాని ఎన్కౌంటర్ అనంతరం అక్కడ ఎక్కువగా కర్ఫ్యూ నీడలోనే గడిచింది. ఈ సమయంలో జనం ఎక్కువగా ఇళ్లకే పరిమితమైపోయారు. వారు బ్యాంకుల్లో డబ్బు దాచుకోవడం మాట అటుంచితే.. సేవ్ చేసుకున్న అంతో ఇంతో డబ్బు కూడా ఖర్చయిపోయింది. అందువల్లే ఏటీఎంల వద్ద దేశంలోని మిగతా ప్రాంతాల్లా కాకుండా ఇక్కడ క్యూలలో జనం తక్కువగా ఉన్నారని ఈ పరిస్థితులను విశ్లేషిస్తూ కశ్మీర్ యూనివర్సిటీ బిజినెస్ అండ్ ఫైనాన్సియల్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ సంగ్మీ వెల్లడించారు. కర్ఫ్యూ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు ముందు జాగ్రత్తగా నిత్యావసరాలను నిల్వ ఉంచుకోవడం కూడా వారికి ఏటీఎంలతో పనిలేకుండా చేస్తుందని ఆయన తెలిపారు. -
పెట్రోల్ బంకులు కిటకిట
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో పెట్రోల్ బంకులు వినియోగదారులతో పోటెత్తాయి. పెట్రోల్, డీజిల్ పోయించుకునేందుకు ప్రజలు బంకుల ముందు బారులు తీరారు. దీంతో నగరంలోని పెట్రోల్ బంకులన్నీ జనంతో కిటకిటటలాడాయి. డిసెంబర్ 2 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ బంకుల్లో, విమానాశ్రయాల్లో టికెట్ల కొనుగోలుకు పాత రూ. 500 నోట్లు అనుమతించమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో జనం పెట్రోల్ బంకులకు పరుగులు పెట్టారు. పాత రూ. 500 నోటుతో నా బైకులో పెట్రోల్ పోయించుకునేందుకు వచ్చానని ముంబై శివారు ప్రాంతం మలాద్ లో ఓ పెట్రోల్ బంకు ముందు నిలుచున్న అక్షయ్ ముగ్దల్ అఏ వ్యక్తి తెలిపాడు. మరోవైపు సామాన్యుల నోట్ల కష్టాలు కొనసాగుతున్నాయి. బ్యాంకుల, ఏటీఎంల ముందు జనం బారులు తీరుతున్నారు. బ్యాంకుల్లో పడిన జీతం డబ్బులు తీసుకునేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. దక్షిణ ముంబైలో 150 ఏళ్ల చరిత్ర కలిగిన మంగళదాస్ వస్త్రాల మార్కెట్ మూడు వారాలుగా డీలా పడింది. పాత పెద్ద నోట్ల రద్దుతో మార్కెట్ ఖాళీ అయిపోయిందని, పిల్లలు ఇక్కడ క్రికెట్ ఆడుకుంటున్నారని వస్త్ర దుకాణదారు ఒకరు చెప్పారు. మిగతా వ్యాపారాలు కూడా దారుణంగా పడిపోయాయి. -
క్యూలైన్లు అక్కడ తగ్గి.. ఇక్కడ పెరిగాయ్!
-
క్యూలైన్లు అక్కడ తగ్గి.. ఇక్కడ పెరిగాయ్!
న్యూఢిల్లీ : పెద్ద నోట్లు రూ.500, రూ.1000ను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయానికి నేటికి పదిరోజులు. ఇన్ని రోజులకి శనివారం బ్యాంకుల వద్ద క్యూలైన్లు కొంచెం తగ్గుముఖం పట్టాయి. కానీ ఏటీఎంల వద్ద పరిస్థితి మాత్రం అలాగే ఉంది. క్యూలైన్లతో ఏటీఎంలు కిటలాడుతున్నాయి. అమలులో లేని నోట్ల మార్పిడిలో కఠినతరమైన నిబంధనలు, కేవలం వారి సొంత కస్టమర్లకే నేడు బ్యాంకులు పనిచేయనుడటంతో బ్యాంకులు వద్ద క్యూలైన్లు తగ్గినట్టు తెలుస్తోంది. అదేవిధంగా నేడు రూ.500, రూ.1000 నోట్ల మార్పిడినీ బ్యాంకులు చేపడటం లేదు. కేవలం సీనియర్ సిటిజన్లకు మాత్రమే ఎలాంటి నిబంధనలు లేకుండా.. ఏ బ్యాంకు బ్రాంచులోనైనా నోట్ల మార్పిడిని చేసుకునే అవకాశాన్ని నేడు బ్యాంకులు కల్పిస్తున్నాయి. నగదు డిమాండ్ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రభుత్వం నోట్ల మార్పిడినీ రూ.4500 నుంచి రూ.2000కు ప్రభుత్వం కుదించిన సంగతి తెలిసిందే. క్రమక్రమంగా బ్యాంకు శాఖల్లో క్యూలైన్లు తగ్గుతాయని, ఆందోళనకర పరిస్థితులు వైదొలుగుతాయని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. వచ్చిన కస్టమర్లే పలుమార్లు రాకుండా.. ఇతరులకు కూడా అవకాశం ఇచ్చేందుకు ప్రభుత్వం ఇంక్ నిబంధనను తీసుకొచ్చింది. నోట్ల మార్పిడికి వచ్చిన కస్టమర్ల వేళ్లకు ఇంక్ గుర్తువేస్తోంది. ఈ నేపథ్యంలో బ్యాంకుల వద్ద క్యూలైన్లు తగ్గుతున్నట్టు తెలుస్తోంది. కానీ ఏటీఎం వద్ద మాత్రం పరిస్థితి మారలేదు. బ్యాంకుల వద్ద పరిమితులు విధించే సరికి, ఏటీఎం వద్ద క్యూలైన్లు భారీగా పెరిగాయి. నోట్ల రద్దు అనంతరం నగదును ప్రజలకు సులభతరంగా అందుబాటులోకి తేవడంలో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా, ప్రభుత్వం పడరానిపాట్లు పడుతోంది. నగదు లావాదేవీలు అధికంగా జరిపే కూరగాయల వర్తకులు, దాబాలు, చిన్నదుకాణదారుల నుంచి డిమాండ్ అధికంగా ఉండటంతో వారికి సరిపడ నగదును ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురాలేకపోతోంది. చిన్న కరెన్సీ నోట్లు కూడా లేకపోవడంతో ప్రజలు వారి కనీసఅవసరాలు తీర్చుకోవడం కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రుల్లో చికిత్సపొందే పేషంట్ల పరిస్థితైతే ఇక చెప్పనక్కర్లేదు. మెడిషిన్లు కొనుక్కోవడానికి కూడా వారి దగ్గర డబ్బులు ఉండటం లేదు. -
అక్షరాలా అరకోటి
ఆదివారమూ పోటెత్తిన పుష్కర భక్తులు గంటల తరబడి క్యూలు, రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు సాక్షి నెట్వర్క్: పుష్కర భక్తులకు ఆదివారం కూడా ట్రాఫిక్ తిప్పలు తప్పలేదు. ఆదివారం ఒక్కరోజే తెలంగాణ వ్యాప్తంగా 52.39 లక్షల మంది భక్తులు పుష్కర క్షేత్రాలను సందర్శించారు! దాంతో ప్రధాన పుష్కర ప్రాంతాల్లో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ స్తంభించింది. భద్రాచలం, కాళేశ్వరం, బాసర ప్రాంతాల్లో వేలాది వాహనాలు ట్రాఫిక్ రద్దీతో చిక్కి భక్తులు అల్లాడిపోయారు. భద్రాచలంలో ఐదారు గంటల పాటు వాహనాలు కదిలే పరిస్థితి లేకపోవడంతో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జగదీశ్‌రెడ్డి కాలినడకన వెళ్లి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. కాళేశ్వరంలోనూ 20 కిలోమీటర్ల వర కు ట్రాఫిక్ స్తంభించడంతో మంత్రి ల క్ష్మారెడ్డి, మంథని ఎమ్మెల్యే పుట్ట మధు రద్దీ తగ్గించే చర్యలు చేపట్టారు. వాహనాల్లోని భక్తులకు నీళ్లు, ఆహార ప్యాకెట్లను అందించారు. బస్సు లు ఏ మూలకూ చాలక భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వర్షం కురవడం వారి కష్టాలను మరిం త పెంచింది. గూడెం ఘాట్‌లో సౌకర్యాల గురించి మంత్రులు హరీశ్‌రావు, ఈటెల రాజేందర్ భక్తులను అడిగి తెలుసుకున్నారు. పలుచోట్ల మంత్రులు పుష్కర స్నానం చేశారు. తెలంగాణలో ఇప్పటివరకు 2.5 కోట్ల మంది భక్తులు పుణ్యసాన్నాలు చేశారని దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రకటించారు. భక్తులు అంచనాలకు మించి తరలి వస్తున్నారన్నారు. విషాదం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వాసి గాదంశెట్టి శ్యాం సుందర్(66) భద్రాచలంలో పుణ్యస్నానం అనంతరం స్వామి దర్శనానికి క్యూలో ఉండగా సృహ తప్పి పడిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. ఖమ్మం అశ్వాపురం మండలం నెల్లిపాకబంజర వద్ద పుష్కరస్నానానికి వచ్చిన దిలిశాల సత్యనారాయణ అనే పశువైద్యుడు నెల్లిపాక వద్ద పడవ ఎక్కి అవతలి ఒడ్డుకు వెళ్తూ గల్లంతయ్యాడు. నర్సాపూర్ వద్ద ఆయన మృతదేహం లభ్యమైంది. తగినన్ని బస్సులు నడపండి * పుష్కరాలపై సమీక్షలో సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: రెండ్రోజులుగా భక్తుల రద్దీ పెరిగినందున పుష్కరాల్లో ట్రాఫిక్ జామ్ లేకుండా తగిన చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అలాగే ఎక్కడ ఎన్ని బస్సులు అవసరముంటే అన్ని పంపాలని ఆర్టీసీ ఎండీ రమణారావును ఆదేశించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లను తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం ప్రతినిత్యం సమీక్షిస్తున్నారు. వివిధ జిల్లాల్లోని పుష్కర ఘాట్ల వద్ద ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రులు హరీష్‌రావు, తుమ్మల, జగదీష్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న తదితరులతో ఆదివారం మాట్లాడారు. సీఎం ఆదేశాల మేరకు డీజీపీ అనురాగ్‌శర్మ, ఇతర పోలీసు అధికారులు బాసర నుంచి భద్రాచలం వరకు హెలికాప్టర్లో తిరుగుతూ పరిస్థితిని సమీక్షించారు. -
'డంకిన్ డోనట్స్' కోసం క్యూ కట్టారు
హైదరాబాద్ : ఫ్రీగా వస్తే ఎవరైనా సరే ఏదీ వదిలిపెట్టరు. అదీ ఫుడ్... ఉచితంగా ఇస్తేమంటే ఇంకేంటి పండుగే. అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు జనాలు భారీగా ఎగబడ్డారు. దాంతో సుమారు రెండు కిలోమీరట్ల వరకూ క్యూ ఏర్పడింది. ఎక్కడా అనుకుంటున్నారా? కొత్తగా ఏదైనా షాపు ఓపెన్ చేస్తే ...కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆఫర్లు పెడతారు. 'డంకిన్ డోనట్స్' కూడా ఈ పద్ధతి ఫాలో అయ్యింది. మొదటి 300మందికి ఉచితంగా ఫుడ్ సర్వ్ చేస్తామని యాజమాన్యం ప్రకటించటంతో చిన్నా, పెద్దా, ఆడ, మగా అందరూ క్యూ కట్టేశారు. ఇంతకీ ఈ షాపు ఎక్కడనుకుంటున్నారా? బంజారాహిల్స్ రోడ్ నెంబర్.1లో 'డంకిన్ డోనట్స్' రెస్టారెంట్. శనివారం నుంచి ప్రారంభిస్తున్నామని రెస్టారెంట్ యాజమాన్యం ఒకరోజు ముందుగానే ప్రచారం చేపట్టింది. ముందుగా వచ్చిన 300మందికి ఉచితంగా సర్వ్ చేస్తామని. దాంతో ఉదయం 5 గంటల నుంచే షాప్ ముందు పడిగాపులు పడ్డారు. చాంతాడంత క్యూ ఏర్పడటంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు కూడా డ్యూటీలోకి దిగారు. కొసమెరుపు ఏంటంటే... ఈ క్యూలో బడాబాబులే ఎక్కువగా ఉండటం విశేషం.


