తీవ్ర గందరగోళం మధ్య ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఆదివారానికి వాయిదా పడింది. శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందంటూ అధికార టీడీపీ చైర్మన్ ఎన్నికను రేపటికి వాయిదా వేయించింది. ఇప్పటికిప్పుడు ఎన్నిక జరిగితే తమ ఓటమి ఖాయమనుకున్న టీడీపీ సభ్యులు శనివారం పక్కా ప్రణాళికతో ఎన్నికల హాలులో వీరంగం సృష్టించారు.