బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం సాయంత్రం ప్రముఖులకు ‘ఎట్ హోం’ తేనీటి విందును ఏర్పాటు చేశారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి వారం క్రితం హైదరాబాద్ నగరానికి విచ్చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి విడిది ముగింపు సందర్భంగా జరిగిన ఎట్ హోంకు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధక్షుడు ఎల్.రమణ, పలువురు మంత్రులు హాజరయ్యారు.