ప్రాణహిత ప్రాజెక్టు పై కొందరు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్ రావు అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ప్రతి విషయంలోనూ విమర్శలు చేసేవారు ఎప్పుడూ ఉంటారని ఆయన ఘాటుగా స్పందించారు. పోతిరెడ్డిపాడుపై టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలకు మాట్లాడే హక్కు లేదని ఆయన మండిపడ్డారు. తెలంగాణకు అన్యాయం జరుగుతున్నపుడు ఉత్తమ్, భట్టి నోరు మెదపలేదని ఆయన ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా.. తెలంగాణ రైతులకు నీరందిస్తాయని ఈ సందర్భంగా హరీశ్ రావు పేర్కొన్నారు.