నటుడు ప్రకాశ్రాజ్, దర్శకుడు శ్రీను వైట్ల మధ్య వివాదం త్వరలో సమసిపోతుందని మూవీ ఆర్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడు మురళీమోహన్ ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యక్తుల మధ్య బేదాభిప్రాయాలు తలెత్తడం సహజమని ఆయన వ్యాఖ్యానించారు. ఇటువంటి విషయాలను నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాలని, మీడియాకెక్కడం మంచిదికాదన్న అభిప్రాయాన్ని మురళీమోహన్ వ్యక్తం చేశారు. 'ఆగడు' సినిమా నుంచి ప్రకాశ్రాజ్ ను తొలగించడంతో వివాదం చెలరేగింది. శ్రీను వైట్ల అహంకారి అని ప్రకాశ్ రాజ్ ఘాటుగా విమర్శించారు. తన మాటలను సిగ్గులేకుండా ఆగడు సినిమాలో వాడుకున్నారని ధ్వజమెత్తారు. ప్రకాశ్రాజ్ కే సిగ్గులేదని శ్రీనువైట్ల ఎదురుదాడి చేశారు.