కర్నూలు జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగిలింది. టీడీపీ జిల్లా వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్ రామిరెడ్డి సహా పలువురు కీలక నేతలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కోవెలకుంట్ల మండలం కంపమళ్లమెట్ట వద్ద వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో శనివారం సుమారు 50మంది తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్‌ఆర్ సీపీలో చేరగా, వారందరినీ జగన్... సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.