ఎట్టకేలకు ఏపీ పోలీసులు దిగొచ్చారు. పొలిటికల్ పంచ్ వెబ్‌సైట్ నిర్వహిస్తున్న ఇంటూరి రవికిరణ్(35)ను విడిచిపెట్టారు. గురువారం తెల్లవారుజామున సమయంలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని తన నివాసంలో ఉన్న రవికిరణ్‌ను తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.