అసెంబ్లీ ఎన్నికలు వాయిదా వేయాలని హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలైంది. కృష్ణాజిల్లా పామర్రు ఎమ్మెల్యే దాసు ....ఎన్నికలను వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. అసెంబ్లీ గడువు ముగియకుండానే ఎన్నికలు నిర్వహించటం చట్టవిరుద్ధమని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నాడు. అసెంబ్లీ రద్దు కానందున ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్తో తెలిపారు. రాష్ట్రాన్ని విడగొట్టామని ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అపాయింటెడ్ డేట్ కన్నా ముందే ఎన్నికలు నిర్వహించవద్దని దాస్ తన పిటిషన్లో అభ్యర్థించారు. పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ....రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. అంతే కాకుండా దీనిపై సమగ్ర వివరణ ఇవ్వాలని న్యాయస్థానం సూచించింది. దీంతో భన్వర్ లాలు గురువారం కోర్టుకు హాజరు కానున్నారు.
Mar 19 2014 2:49 PM | Updated on Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement