ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో థ్వజమెత్తారు. సోమవారం ఉదయం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతం రోజా మాట్లాడుతూ...’ స్నానం చేయకుండా 24 గంటలపాటు రాష్ట్ర ప్రజల కోసమే విదేశీ పర్యటనలు చేస్తున్నానని చంద్రబాబు అన్న మాటలకు జనం నవ్వుకుంటున్నారు. బాబు ఎందుకు విదేశీ పర్యటనలు చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడంలేదు.