జమ్మూ కశ్మీర్ లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాలేదు. దీంతో జమ్మూలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జమ్మూలో పీడీపీ 28 సీట్లను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించగా, బీజేపీ 25సీట్లతో రెండో స్థానాన్ని కైవశం చేసుకుంది. ఇక్కడ అధికార ఎన్సీ (నేషనల్ కాన్ఫిరెన్స్) 15 స్థానాలకే పరిమితం కాగా, కాంగ్రెస్ కు 6 స్థానాలు దక్కాయి. ఈసారి బీజేపీ గణనీయంగా ఓట్ల శాతాన్ని పెంచుకుని పీడీపీతో పోటీ పడింది.