'నా అంతరాత్మ క్షోభిస్తోంది నిజాలు చెబుతున్నా' | panner-selvam-reveals-some-facts-with-media | Sakshi
Sakshi News home page

Feb 8 2017 6:38 AM | Updated on Mar 21 2024 8:11 PM

తమిళనాడు చెన్నై తీరంలోని మాజీ సీఎం జయలలిత సమాధి వద్ద దాదాపు గంటసేపు హైడ్రామా నడిచింది. జయ సమాధి వద్ద మాజీ సీఎం పన్నీర్ సెల్వం దాదాపు గంటసేపు మౌనంగా కూర్చున్నారు. అనంతరం పన్నీర్ సెల్వం మీడియాతో మాట్లాడారు. తనను సీఎం పదవి నుంచి బలవంతం రాజీనామా చేయించారని చెప్పారు. రాజీనామాను వెనక్కి తీసుకునేందుకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల సమావేశానికి తనను ఆహ్వానించలేదని, నిరంతరం తనను అవమానించారని, కించ పరిచారని సంచలన నిజాలు వెల్లడించారు. తాను మంచి పనులు చేస్తే కొందరికి నచ్చదని, ఇష్టం లేకపోయినా తప్పని పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సి వచ్చిందని పన్నీర్ సెల్వం పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement