‘ఓటుకు కోట్లు’ కేసులో చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే డీకే సత్యప్రభ కుమారుడు డీకే శ్రీనివాసులు నాయుడు(మాజీ ఎంపీ ఆదికేశవులు నాయుడు కుమారుడు)కి ఏసీబీ సోమవారం నోటీసులు జారీ చేసింది. శ్రీనివాసులు నాయుడు ప్రస్తుతం కర్ణాటకలో ఓ బేవరేజస్ కంపెనీకి ఎండీగా వ్యవహరిస్తున్నారు.