2000లో మధ్యప్రదేశ్‌ను విభజించి ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే సమయంలో కేంద్రం చెప్పిందేమిటి? అక్కడ నిజంగా జరిగిందేమిటి? విభజన కష్టాలేమిటి? ఈ అంశాలను తెలుసుకోవటానికి ‘సాక్షి’ అక్కడ పర్యటించింది. ఇందులో విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. విభజనకు ముందు కేంద్రం చెప్పిన మాటలన్నీ ఉత్తివే అని తేలింది. ఛత్తీస్‌గఢ్ ఏర్పడి 13 ఏళ్లు గడిచినా అక్కడ నేటికీ ‘కొత్త రాజధాని’ కలగానే మిగిలింది.