సంచలనం కలిగించిన నిఖిల్ రెడ్డి ఆపరేషన్ కేసులో డాక్టర్పై చర్యలు తీసుకున్నారు. ఎత్తు పెరిగేందుకు నిఖిల్ రెడ్డికి అశాస్త్రీయ పద్దతిలో ఆపరేషన్ చేసిన డాక్టర్ చంద్రభూషణ్ లైసెన్స్ను రెండేళ్ల పాటు రద్దు చేశారు.దాదాపు ఆరు నెలల క్రితం గ్లోబల్ ఆస్పత్రిలో నిఖిల్ రెడ్డి ఎత్తు పెరిగేందుకు సర్జరీ చేయించుకున్నాడు. కాగా సర్జరీ విజయవంతం కాకపోగా, ఆ తర్వాత నిఖిల్ రెడ్డి నడవలేకపోయాడు. మంచానికే పరిమితమయ్యాడు. వైద్యుల నిర్వాకంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. నిఖిల్ రెడ్డికి ఆపరేషన్ చేసిన వైద్యులపై చర్యలు తీసుకుని, అతనికి పరిహారం చెల్లించాలని ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేశారు. నిఖిల్ రెడ్డి కుటుంబసభ్యులు హెచ్ఆర్సీ, ఇండియన్ మెడికల్ కౌన్సిల్కు ఫిర్యాదు చేశారు.