నానా పాటేకర్.. నాలుగు మాటలు | nana patekar meets kashmiri youth, asks them to study well | Sakshi
Sakshi News home page

Nov 16 2016 2:56 PM | Updated on Mar 21 2024 6:13 PM

బాలీవుడ్‌లో విలక్షణ నటులు చాలామందే ఉన్నారు. వాళ్లందరిలోకీ కూడా విలక్షణమైన వ్యక్తి నానా పాటేకర్. నూటికి నూరుపాళ్లు తాను చెప్పేది ఆచరించే మనిషి ఆయన. వ్యవస్థలో ఉన్న చిన్న చిన్న లోపాల మీద కూడా ఆయన చేసే పోరాటం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అవే విషయాలను చాలాసార్లు సినిమాల్లో తన పాత్రల ద్వారా కూడా చెబుతారు. అలాంటి నానా.. జమ్ము కశ్మీర్‌లోని యువతను బుధవారం కలిశారు. వాళ్లతో మాట్లాడారు. ఆర్మీ జవాన్లతో కలిసి యువతీ యువకులను కలిసిన నానా.. వాళ్లకు నాలుగు మంచి మాటలు చెప్పారు. యువత ముందుగా చదువుకోవాలని, ప్రధాన స్రవంతిలోకి రావాలని సూచించారు. చదువుకుంటేనే ఏమైనా సాధ్యమవుతుందని, బాగా పైకొచ్చి దేశాన్ని కూడా అభివృద్ధి చేయాలని తెలిపారు. అంతేతప్ప.. ఇలా చేస్తే మాత్రం (రాళ్లు రువ్వడం) జీవితంలో ఏమీ సాధించలేరని చెప్పారు. అసలు ముందు ఈ దేశాన్ని మీది అనుకుంటే, ఆ తర్వాత అన్నీ చాలా సులభం అవుతాయని అన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement