నేడే వైఎస్సార్ నవోదయం పథకం | YSR Navodayam Scheme in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

నేడే వైఎస్సార్ నవోదయం పథకం

Oct 17 2019 7:44 AM | Updated on Mar 21 2024 8:31 PM

పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ భారం,  మందగమనం లాంటి వరుస కష్టాలతో ఆర్థికంగా కుంగిపోయిన సూక్ష్మ, చిన్న మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన ‘వైఎస్సార్‌ నవోదయం’ పథకం గురువారం ప్రారంభం కానుంది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  చేతుల మీదుగా ప్రారంభమయ్యే ఈ పథకం ద్వారా సుమారు 80,000 యూనిట్లు ప్రయోజనం పొందనున్నాయి. లక్షల మందికి ఉపాధి కల్పించే ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేందుకు సీఎం ఈ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. వైఎస్సార్‌ నవోదయం పథకం కింద ఎంఎస్‌ఎంఈలకు ఆర్థిక తోడ్పాటును అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.10 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement