పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పంప్ హౌస్‌లో రూ. 2400 కోట్లు కుంభకోణం జరిగింది.. రూ.50 కోట్ల మోటార్లు రూ.90 కోట్లకు అంచనాలు పెంచారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మొత్తం 35 పంపింగ్ స్టేషన్స్ ఉన్నాయంటూ కేసీఆర్‌కు ఆధారాలతో లేఖ రాసినట్టు చెప్పారు. కేసీఆర్ అవినీతిలో మొనగాడని.. మోదీతో పోల్చుకునే స్ధాయి కేసీఆర్ కు లేదన్నారు. రైతులకు బేడీలు.. ఉగ్రవాదులకేమో గులాబీ పూలు.. ఇదీ కేసీఆర్ విధానమంటూ విమర్శించారు.