ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం ఎంత అథమస్థాయికి దిగజారిందో ఘోరమైన బస్సు ప్రమాదం అనంతర పరిణామాలు సూచిస్తున్నాయి. భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెడుతున్న ప్రైవేటుబస్సు రాజధాని సమీపంలో పెనుగంచిప్రోలు దగ్గర మంగళవారం తెల్లవారుజామున అదుపుతప్పి కాలువలో పడి పది మంది ప్రయాణికులు చనిపోయారు. 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ దుర్వార్త తెలిసిన వెంటనే ప్రభుత్వం ఏమి చేయాలి? రాజధానిలో ఉన్న ముఖ్యమంత్రి హుటాహుటిన ప్రమాదస్థలానికి వెళ్ళాలి. అధికారులను పరుగులు తీయించాలి. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించాలి. మంత్రులు ఘటనా స్థలంలో ఉండి ప్రభుత్వ యంత్రాంగం పనితీరును పర్యవేక్షించాలి