ఆర్నెల్ల కింద నుంచే ‘ఆపరేషన్ నయీమ్..’! | Major Encounter Near Hyderabad, Gangster Killed | Sakshi
Sakshi News home page

Aug 9 2016 11:35 AM | Updated on Mar 21 2024 7:54 PM

మాజీ నక్సలైట్, గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఆగడాలకు అడ్డుకట్ట వేసేం దుకు ఆరు నెలల కిందే ‘ఆపరేషన్ నయీమ్’ మొదలైంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు హెచ్చరికలు చేసిన నయీమ్, అతడి ముఠా పనిపట్టాలని ప్రభుత్వం ఆదేశించడంతో.. పోలీసు శాఖ పక్కా వ్యూహాన్ని అమలు చేసింది. ముందు నయీమ్ అనుచరులు లొంగిపోయేలా చూసింది. అతడికి సహకరిస్తున్న, అతనితో సంప్రదింపుల్లో ఉన్న ప్రజాప్రతినిధులను గుర్తించి.. వారిని గట్టిగా హెచ్చరించింది. నయీమ్‌తో సంబంధాలున్న పోలీ సు ఉన్నతాధికారులకు ఆపరేషన్ వివరాలు తెలియకుండా జాగ్రత్త పడింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement