తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు సోమవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప పెద్దశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వేంకటేశుడు కొలువు దీరింది శేషాద్రి. ధరించేది శేష వస్త్రం. పానుపు శేషుడు. అందుకే ఉత్సవాలలో శేషుడికి అత్యంత ప్రాధాన్యత. అందుకే తొలి రోజు శేషవాహనం మీదే ఊరేగే సంప్రదాయంగా వస్తోంది. సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవలో పూజలందుకున్న స్వామి వాహన మండపంలో వేంచేశారు. బంగారు, వజ్ర, వైఢూర్య, మరకత, మాణిక్య, పట్టు పీతాంబర వస్త్ర, సుగంధ పరమళ పుష్పమాలలతో విశేషంగా అలంకరించారు. రాత్రి 9 గంటలకు ఛత్రచామర, మంగళవాయిద్యాల, పండితుల వేద మంత్రోచ్ఛారణలు, భక్తుల గోవింద నామస్మరణల మధ్య ఉత్సవర్లు ఆలయ పురవీధుల్లో ఊరేగారు.
Oct 4 2016 6:58 AM | Updated on Mar 21 2024 9:51 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement