ప్రధాని నరేంద్ర మోదీని వ్యతిరేకిస్తూ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ప్రతిపాదన చేశారు. ప్రధానిగా మోదీని తప్పించి దేశాన్ని కాపాడాలని బీజేపీని కోరారు. మోదీ స్థానంలో ఎల్‌కే అద్వానీ, రాజ్‌నాథ్ సింగ్ లేదా అరుణ్ జైట్లీ పగ్గాలు చేపట్టాలని సూచించారు.