తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ఎంపి లగడపాటి రాజగోపాల్ సాక్షి ప్రతినిధిని నోటికి వచ్చినట్లు మాట్లాడారు. సమావేశం చివరలో ప్రశ్నించడంతో ఆయన రెచ్చిపోయారు. చిందులు తొక్కారు. నోటికి వచ్చినట్లు మాట్లాడారు. పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. సాక్షి ప్రతినిధిపై నోరుపారేసుకున్నారు. ఇది తన ప్రెస్ మీట్ అని, వెళ్లిపోవాలని గద్దించారు. వెంటనే వెళ్లిపోవాలని సాక్షి ప్రతినిధిపై చిందులు వేశారు. దిగజారి మాట్లాడారు. రాజకీయంగా సహనం కోల్పోయి సాక్షి ప్రతినిధిపై అక్కసును వెళ్లగక్కారు. రాజగోపాల్ వ్యవహారశైలిని జర్నలిస్టులు ఖండించారు. ఈ విధంగా మాట్లాడటం మంచిదికాదని హితవు పలికారు. లగడపాటిని విలేకరులు నిలదీశారు. లగడపాటి తీరును విలేకరులు ఎండగట్టారు. సహనం కోల్పోయిన లగడపాటి 'జగన్మోహన రెడ్డి సంక నాకుతున్నారా?' అని రాయడానికి వీలుకాని భాష వాడారు. ఈ మాటలు పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా ఉన్నాయని సీనియర్ జర్నలిస్టులు ఖండించారు. లగడపాటి తీరును వారు తప్పుపట్టారు.