వేతన బకాయిల కోసం టీడీపీ ఎంపీ కేశినేని నాని కార్యాలయం ఎదుట కేశినేని ట్రావెల్స్ సిబ్బంది ఆందోళనకు దిగారు. ఏడాది కాలంగా తమకు వేతనాలు చెల్లించడం లేదని ట్రావెల్స్ సిబ్బంది ధర్నా చేపట్టారు. వేతన బకాయిలు చెల్లించకుండా, హఠాత్తుగా ట్రావెల్స్ మూసివేశామంటూ తమ ఉద్యోగాలను తీసివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తాము ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకునే వ్యవధి కూడా ఇవ్వకుండా ట్రావెల్స్ ను రాత్రికిరాత్రే మూసివేసి తమను రోడ్డు పాలు చేశారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రావెల్స్ సిబ్బంది ఆందోళన సందర్భంగా ఎంపీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంపీ అందుబాటులో లేరని, ఆయన విజయవాడ రాగానే సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళతామని కార్యాలయ సిబ్బంది చెప్పారు.