ఎస్సీ వర్గీకరణను కేంద్ర ప్రభుత్వం తక్షణం చేపట్టాలని కోరుతూ అఖిలపక్ష బృందాన్ని ప్రధానమంత్రి వద్దకు తీసుకెళ్లేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు రంగం సిద్ధం చేశారు. ఇందుకోసం ఈనెల 6వ తేదీన ఆయన ప్రధాని నరేంద్రమోదీ అపాయింట్‌మెంట్ కూడా తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టాలంటూ తెలంగాణ అసెంబ్లీలో ఇప్పటికే తీర్మానం చేశామని, వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది కాబట్టి కేంద్రాన్ని కూడా ఈ విషయమై వెంటనే చర్యలు చేపట్టాల్సిందిగా కోరాలని కేసీఆర్ నిర్ణయించారు.