ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వేగంగా చేరవేసేందుకే జిల్లాల పునర్విభజన ప్రక్రియను చేపట్టామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ప్రస్తుతానికి 31 జిల్లాలు అనుకుంటున్నామని, మంత్రివర్గ అత్యవసర సమావేశం తర్వాత పూర్తి స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు. జిల్లాల ఏర్పాటు తర్వాత నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందన్నారు. చిన్న జిల్లాల్లో పర్యవేక్షణ ఎక్కువగా ఉంటుందని, మంచి పాలన సాగుతుందని చెప్పారు.