బాలనేరస్తుల చట్ట సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. మంగళవారం రాజ్యసభలో ఈ బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగిన అనంతరం ఆమోదం లభించింది. బాలనేరస్తుల వయస్సును 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించారు. నిర్భయ తల్లిదండ్రులు రాజ్యసభకు వచ్చి గ్యాలరీలో నుంచి బిల్లుపై చర్చను చూశారు.