రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై ఈ నెల 22న తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి అనుమతివ్వా లని దరఖాస్తు చేసుకున్నా పోలీసులు అనుమతివ్వట్లేదంటూ టీజేఏసీ హైకోర్టును ఆశ్రయించింది. శాంతియుతంగా ర్యాలీ చేపడతామని హామీ ఇచ్చినా పోలీసులు అనుమతివ్వట్లేదని, తమ ర్యాలీకి అనుమతి చ్చేలా ఆదేశించాలని కోరుతూ టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, అధికార ప్రతినిధి జి.వెంకట్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి, నగర పోలీసు కమిషనర్, చిక్కడపల్లి ఏసీపీ, చిక్కడపల్లి పీఎస్ ఎస్‌హెచ్‌ఓలను ప్రతివాదు లుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై న్యాయ మూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు సోమ వారం విచారణ జరపనున్నారు.
Feb 19 2017 7:09 AM | Updated on Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement