తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావుపై జేఏసీ చైర్మన్ కోదండరాం మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గ్యాంగ్స్టర్ నయీం భూములు గుంజుకున్నట్లు కేసీఆర్ సర్కార్ కూడా భూములు లాక్కుంటున్నదన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం భూ నిర్వాసితుల సదస్సులో ఆయన మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి ప్రాజెక్టులు అవసరమే కానీ వాటికి పక్కా ప్రణాళిక ఉండాలి, ప్రజలతో సంప్రదింపులు జరిపి భూములు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.