నయీం కేసులో మళ్లీ కదలిక వచ్చింది. ఆదాయపన్ను శాఖ అధికారులు నయీం భార్యకు నోటీసులు పంపించారు. నయీం అక్రమంగా పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టారని అవన్నీ ఎలా వచ్చాయో తమకు వివరించాని పేర్కొంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. యాదాద్రి జిల్లాలోని భువనగిరిలోగల నయీం ఇంటికి ఈ నోటీసులు అంటించారు. ప్రస్తుతం ఆ ఇంట్లో ఎవరూ లేరని తెలుస్తోంది. తెలంగాణలో నయీం కేసు పెద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.