ఇరాక్లోని మోసుల్ నగరం నుంచి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ అధినేత అబు బకర్ అల్ బాగ్దాదీ పారిపోయాడని బ్రిటన్ వెల్లడించింది. బ్రిటన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి బోరిస్ జాన్సన్ శుక్రవారం ఈ విషయాన్ని ప్రకటించారు.ఐఎస్ ఉగ్రవాదులను ఉద్దేశిస్తూ బాగ్దాదీ మాట్లాడిన ఆడియోను గురువారం విడుదల చేసినట్టు ఇంటలిజెన్స్ వర్గాలు తెలిపాయి. మోసుల్ కోసం చేస్తున్న పోరాటంలో విజయం సాధిస్తామనే నమ్మకముందని, ఇరాక్ భద్రత దళాలపై పోరాటాన్ని కొనసాగించాల్సిందిగా బాగ్దాదీ తన అనుచరులను ఆదేశించాడు. ఇరాక్ దళాలను ఎదుర్కోవడంలో వెనుకంజవేయవద్దని సూచించాడు. దీన్నిబట్టి బాగ్దాదీ మోసుల్ నుంచి మరో సురక్షిత ప్రాంతానికి వెళ్లాడని ఇంటలిజెన్స్ వర్గాలు తెలిపినట్టు బోరిస్ జాన్సన్ వెల్లడించారు.
Nov 4 2016 7:31 PM | Updated on Mar 20 2024 3:35 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement