తుస్... చాలెంజ్! | International scames to amaravati development | Sakshi
Sakshi News home page

Jul 19 2016 6:44 AM | Updated on Mar 22 2024 11:05 AM

అమరావతి అభివృద్ధి పేరుతో సాగుతున్న అంతర్జాతీయ స్కాముల నాటకంలో అసలు అంకానికి తెరలేచింది. ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం పేరుతో సింగపూర్ ప్రైవేట్ సంస్థలతో కుమ్మక్కై సీఎం చంద్రబాబు రచించిన దోపిడీ ప్రణాళికలో ఒక్కొక్క రహస్యం బైటపడుతోంది. రాజధాని అభివృద్ధి భాగస్వామి ఎంపిక కోసం స్విస్ చాలెంజ్ పద్ధతిలో సోమవారం టెండర్ నోటిఫికేషన్ జారీ అయ్యింది. మొదటి నుంచి ‘సాక్షి’ చెబుతున్నట్లుగానే సింగపూర్ ప్రైవేటు సంస్థలు, ప్రభుత్వ పెద్దల మధ్య కుదిరిన రహస్య ఒప్పందాలు సోమవారం జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్‌తో స్పష్టంగా బట్టబయలయ్యాయి.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement