భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్లో సూది ఉన్మాది శనివారం కలకలం సృష్టించాడు. బల్లార్షా నుంచి సికింద్రాబాద్ వస్తున్న భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్లో వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ వద్ద ఎక్కిన రవికుమార్ అనే సైకో ప్రయాణికులను సూదితో గుచ్చి గాయపరిచాడు. సూది ఉన్మాదిని ప్రయాణికులు చితకబాది సికింద్రాబాద్ ప్రభుత్వ రైల్వే పోలీసులకు అప్పగించారు.