తమిళనాట రాజకీయ సంక్షోభం నేపథ్యంలో సరైన సమ యంలో కీలక నిర్ణయం తీసుకుంటామని డీఎంకే నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తెలిపారు. అన్నాడీఎంకే ఎప్పుడూ డీఎంకేకు ప్రత్యర్థేనని స్పష్టం చేశారు. ఎవ్వరికీ మద్దతిచ్చే ప్రసక్తే లేదన్నారు. స్టాలిన్ అధ్యక్ష తన, ప్రధానకార్యదర్శి అన్బళగన్ నేతృత్వంలో సోమవారం చెన్నై తేనాం పేటలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో డీఎంకే ఉన్నతస్థాయి కమిటీ భేటీ జరిగింది. కమిటీలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలతో గంట సేపు రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై స్టాలిన్ చర్చించారు. 11 తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఆ వివరాలను మీడియాకు స్టాలిన్ వివరించారు.