పాకిస్థాన్ ఆర్మీ, ఆ దేశ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ పాల్పడుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) ప్రజలు ఆందోళన బాట పట్టారు. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా గళమెత్తుతున్న కశ్మీర్ ఆజాదీ నేతల బూటకపు ఎన్‌కౌంటర్లు, అక్రమ హత్యలను నిరసిస్తూ పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. ఆర్మీ, ఐఎస్‌ఐ కూడబల్కుకొని ఈ హత్యలు చేస్తున్నాయంటూ పీవోకేలోని కోటిల్ వాసులు ఇటీవల భారీ ఆందోళన నిర్వహించారు.