రోహిత్ వేముల ఆత్మహత్య ఉదంతం అనంతరం నివురుగప్పిన నిప్పులా ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో.. మోజెస్ అబ్రహం అనే మరో దళిత పరిశోధక విద్యార్థి శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నానికి చెందిన ఆయన... వర్సిటీలో ఏసీఆర్‌ఈహెచ్‌ఎం విభాగంలో పీహెచ్‌డీ రెండో సంవత్సరం చదువుతున్నారు. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ల్యాబ్‌లో చేతి మణికట్టు వద్ద నరాలు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. ఇది గమనించిన తోటి విద్యార్థులు, వర్సిటీ సిబ్బంది వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆశా ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం అబ్రహం పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.