ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ సంచలన విజయంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి మరోసారి అనుమానాలను వ్యక్తం చేశారు. ముస్లింలు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లోనూ బీజేపీ గెలుపొందిందని, ఈవీఎంల ట్యాంపరింగ్ జరగకపోతే.. అక్కడెలా బీజేపీ గెలిచిందని ఆమె ప్రశ్నించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే బీజేపీ గెలిచిందని ఆమె ఆరోపించారు. ఇకనుంచి బ్యాలెట్ పేపర్లనే ఎన్నికల నిర్వహణ కోసం వాడాలని మాయావతి ఎన్నికల సంఘాన్ని కోరారు.