షాపింగ్ కు వెళ్లిన హౌస్ సర్జన్ కిడ్నాప్ | house-surgeon-sushmitha-kidnapped-in-cadapa | Sakshi
Sakshi News home page

Jun 20 2015 7:26 AM | Updated on Mar 22 2024 10:59 AM

కడప శివార్లలోని రిమ్స్‌లో హౌస్ సర్జన్‌గా విద్యనభ్యసిస్తున్న సుస్మిత నగరంలోని నాగరాజుపేట వద్ద శుక్రవారం రాత్రి కిడ్నాప్‌కు గురయ్యారు. సహచర విద్యార్థులు, పోలీసులు వివరాల మేరకు.. ఆదిలాదాబాద్ జిల్లా నిర్మల్‌కు చెందిన కేఎస్ ముత్తన్న కుమార్తె కొత్తూరు సుస్మిత రిమ్స్‌లో ఎంబీబీఎస్ ఫైనలియర్ (హౌస్ సర్జన్) చదువుతోంది. శుక్రవారం రాత్రి 7 గంటలకు తన సహచర హౌస్ సర్జన్ సాధనారెడ్డితో కలసి నగరానికి ఆటోలో వచ్చింది. నాగరాజుపేటలోని గంగవరం రెసిడెన్సీ సమీపంలో ఉన్న బ్యూటీ పార్లర్ వద్ద సుస్మిత దిగింది. సాధన వైవీ స్ట్రీట్‌లో షాపింగ్ చేసుకుని వస్తానని వెళ్లింది. ఎనిమిది గంటలకు సాధానరెడ్డి సుస్మితకు ఫోన్ చేయగా, తనను ఎవరో కిడ్నాప్ చేశారని.. ఏడుస్తూ మాట్లాడటంతో ఆమె కంగారుపడింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement