'రెండు మూడురోజులు ఆగలేకపోయారా' | Sakshi
Sakshi News home page

'రెండు మూడురోజులు ఆగలేకపోయారా'

Published Mon, Jul 25 2016 7:14 PM

వీసీల నియామకంపై హైకోర్టు సీరియస్ అయింది. కేసు పెండింగ్లో ఉండగా నియామకాలు ఎలా చేస్తారని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. రెండు, మూడు రోజులు ఆగలేరా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. తీర్పు రిజర్వులో ఉంచింది. తెలంగాణలోని 9 యూనివర్సిటీలకు ఉపకులపతులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసి పదవి విరమణ చేసిన ప్రొఫెసర్ వేణుగోపాల్ రెడ్డిని జేఎన్ టీయూ వీసీగా నియమించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement