ఒకే దేశం.. ఒకే పన్ను విధానమంటూ చారిత్రాత్మక పన్ను విధానం జీఎస్టీ నేటి అర్థరాత్రి నుంచి అమల్లోకి రాబోతుంది. పార్లమెంట్ సెంట్రల్ హాలు వేదికగా ఎంతో అట్టహాసంగా దీనికి అంకురార్పణ చేయబోతున్నారు. దేశమంతా ఒకే జీఎస్టీ ఉండటంతో రకరకాల పన్నుల నుంచి వినియోగదారులకు విముక్తి లభిస్తోంది. అంతేకాక కొన్ని వస్తువులపై పన్ను భారం కూడా వినియోగదారుడిపై పడనుంది.