స్నేహితులంటే వారే! | Sakshi
Sakshi News home page

స్నేహితులంటే వారే!

Published Sun, Aug 3 2014 3:16 PM

సాదారణంగా స్నేహితులు కలిస్తే ఏం చేస్తారు? బాగా ఎంజాయ్ చేస్తారు అని టక్కున సమాదానం వస్తుంది. తరువాత ఫోటోలు, వీడియోలు, ఆ తరువాత ఫేస్ బుక్, వాట్స్ అప్ లోడ్ చేయటం....ఇలా అనేకం వస్తాయి. కాని కొందరు స్నేహితులు ప్రత్యేకంగా ఉంటారు. వారు చేసే పనులు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. సమాజానికి ఉపయోగపడేవిధంగా,ఆదర్శంగా ఉంటాయి. అటువంటి అయిదుగురు స్నేహితుల పరిచయమే ఈ కథనం. అయిదుగురు స్నేహితులు. శరీఫ్, నవీన్ రెడ్డి, కోటేశ్వర్ రావు, ఫనీ, మురళీ కృష్ణ. చిన్నపటి నుంచి కలసి చదువుకున్నారు. కలిసి తిరిగారు. ఆడుకున్నారు. అందరూ గుంటూరు జిల్లా నరసరావుపెటకు చెందిన వారు. స్థానిక ఎస్.కె.ఆర్.బి.ఆర్ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు కలసి చదువుకున్నారు. కాలేజీలో చదువు తున్నప్పుడు ఉద్యోగంలో సెటిల్ అయ్యాక సమాజానికి ఉపయోగపడే పని ఎదో చేయాలని అనుకున్నారు. బీ.టెక్. పూర్తి కాగానే అందరు వివిధ ఐటీ కంపనీలలో ఉద్యోగాలలో చేరాక వారు అనుకున్నది సాదించారు. 2005లో ఫ్రెండ్స్ టు సపోట్ డాట్ కామ్ అనే వెబ్సైట్ను ప్రారంభించారు. రక్తదానం చేస్తూ, దాని పట్ల అందరికీ అవగాహన పెంచుతూ ఎందరో ప్రాణాలని నిలబెడుతున్నారు. హైదరాబాద్లో 200 మంది రక్తదాన దాతలతో ప్రారంభమైన సంస్థలో ఇప్పుడు లక్షా 50 మందిపైగా డోనర్స్ దేశ వ్యాప్తంగా ఉన్నారు. రోజు 150 కొత్త డోనర్లు యాడ్ అవుతున్నారు. అట్లాగే 800 మంది రోగులు రక్తం అందుకుంటున్నారు. ఇంత జరిగినా ఈ సంస్థలో ఎవరికి పదవులు లేవు అందరు జస్ట్ ఫ్రెండ్స్. కేవలం ఐదుగురు లైక్ మైడెడ్ ఫ్రెండ్స్ కలస్తే ఒక మంచి పని సాద్యం అని వీరు అంటారు. నిరూపించారు కూడా. ఫ్రెండ్స్ టూ సపోట్ సంస్థ ఇప్పటికే ఎన్నో జాతీయ , అంతర్జీతీయ స్థాయి అవార్డులు పొందింది. లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్లో వరుసగా ఐదు సంవత్సరాల నుంచి స్థానం సంపాదించింది. ఈ సంస్థ ఎక్కువగా పట్టణ ప్రాంతాలవారికి అందుబాటులో ఉంటుందని, రాబోయే రోజుల్లో ఒక టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫోన్లో రక్తం అవసరం ఉన్న వారికి సమాచారం అందచేయాలని ఈ స్నేహితులు ఆలోచిస్తున్నారు. వారి ఆలోచనలు ఫలించాలని, నలుగురికి ఉపయోగపడుతూ, మరో నలుగురికి ఆదర్శంగానిలవాలని ఆశిద్ధాం.