బాధితుల సమాచారం కోసం బంధువుల ఆందోళన | Families worry about missing relatives in mahabubnagar bus fire | Sakshi
Sakshi News home page

Oct 30 2013 9:39 AM | Updated on Mar 21 2024 7:54 PM

మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన వోల్వో బస్సు ప్రమాద మృతుల బంధువులు హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని జబ్బర్ ట్రావెల్స్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. బాధితుల సమాచారం కోసం ట్రావెల్స్ ప్రతినిధులను ప్రశ్నిస్తున్నారు. బస్సు ప్రమాదంపై ట్రావెల్స్‌ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమవారి వివరాల కోసం వారు ఆందోళన చెందుతున్నాయి. అయితే ట్రావెల్స్ ప్రతినిధులు తమకు సరైన సమాచారం ఇవ్వటం లేదని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమవారి వివరాలు చెప్పాలంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రయాణికుల వివరాల కోసం వారి బంధువులను మీడియా ప్రతినిధులు కోరగా... ప్రస్తుతం తాము మాట్లాడే స్థితిలో లేమని తెలిపారు. మరోవైపు పోలీసులు జబ్బర్ ట్రావెల్స్ కార్యాలయానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement