రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు నెలల తరబడి ఎదురు చూస్తున్న కరువు భత్యం (డీఏ)పై కోత వేసేం దుకు సర్కారు సిద్ధమైంది. గత ఏడాది జూలై నుంచి, ఈ ఏడాది జనవరి నుంచి రెండు డీఏలను ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉండగా... ప్రస్తుతం ఒక్క డీఏ ఇచ్చేందుకే సీఎం చంద్రబాబు అంగీకరించారు.