బతికినప్పుడు నలుగురికీ మనం ఎంత మంచి చేశామన్నదే ముఖ్యం. మద్యం తాగి.. బండి నడుపుతూ చచ్చాడురా అనే మాటల కంటే... ఉన్నన్ని రోజులు మంచి కోసం ఆరాట పడ్డాడురా అనే ఒక చిన్న మాట కనీసం ఒక్కరి నుంచి వచ్చినా ఆ జన్మ ధన్యమైనట్టే. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే మీతో పాటు ఎదుటి వారి ప్రాణాలనూ నిలబెట్టిన వారవుతారు’ ...అంటున్నారు ప్రముఖ నటుడు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్.