అడవి పందులను ఇష్టం వచ్చి నట్లుగా చంపి తినడానికి అనుమతి లేదని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచ టి.బి దినోత్సవం సంద ర్భంగా ఈ నెల 24న ఏటూరునాగారంలో నిర్వహించిన కార్యక్రమంలో తాను మాట్లా డిన మాటల్లో పొరపాటు దొర్లిందని కలెక్టర్ అంగీకరించారు.