నాంపల్లి గ్రౌండ్స్లో చేప మందు ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. అస్త్మా రోగులకు ఎన్నో ఏళ్లుగా బత్తిన సోదరులు చేప మందు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రోగులు వేలాదిగా తరలి వచ్చారు. రోగులకు ఇబ్బంది కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. మందు పంపిణీ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా దాదాపు వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.