వంశధార ప్రాజెక్టు నిర్వాసితులపై ప్రభుత్వం దౌర్జన్యం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. ఇది అన్యాయమని ప్రశ్నిస్తే అరెస్టు చేసి జైలుకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నిర్వాసితులకు ఇంకా 90 శాతం ఇళ్లు ఇవ్వాల్సి ఉండగా ఇళ్లు ఇవ్వకుండా ప్రభుత్వం దౌర్జన్యంగా వారిని ఖాళీ చేయిస్తోందన్నారు. కోర్టు ఆదేశాలున్నా అధికారులు పంట పొలాలను ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే నిర్వాసితులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ నెల 10న వామపక్షాల ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ, ఇతర పార్టీలతో చలో వంశధార కార్యక్రమం చేపడతామని ఆయన హెచ్చరించారు.
'వంశధార నిర్వాసితులపై దౌర్జన్యం'
Oct 6 2017 7:37 PM | Updated on Mar 22 2024 11:31 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement