: కాంగ్రెస్ పార్టీ నేతలు ఛలో మల్లన్న సాగర్ కు పిలుపునివ్వడంతో మంగళవారం ఉదయం గాంధీ భవన్ వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులకు, నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో పాటు తోపులాట జరగడంతో గందరగోళ వాతావరణం నెలకొంది.