పాలడుగు వెంకట్రావు కన్నుమూత | Congress Senior Leader Paladugu Passes away | Sakshi
Sakshi News home page

Jan 19 2015 8:26 AM | Updated on Mar 22 2024 10:39 AM

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పాలడుగు వెంక ట్రావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చిక్రిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. పాలడుగు వెంకట్రావు స్వస్ధలం కృష్ణా జల్లా ముసనూరు మండలం గోగులంపాడు. 1968 యువజన కాంగ్రెస్‌లో చేరిన పాలడుగు నూజివీడు శాసనసభ స్థానం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1972-78 వరకు ఎమ్మెల్సీగా ఉన్నారు. 1978లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. నేరుదుమల్లి కేబినెట్‌లో పౌరసరఫరాల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement