రేషన్ సరుకులకు ఆధార్ అనుసంధాన్ని తొలగించాలంటూ రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రోడ్డెక్కారు. హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఎల్బీనగర్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, రాజేందర్, కూన శ్రీశైలంగౌడ్, రాజిరెడ్డి కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.